
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
తమ దేశంపై దాడులకు దిగుతున్న అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశాన్ని కాపాడుకునేందుకు 1000 శాతం సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శుక్రవారం ప్రకటించారు. శాంతి చర్చలు జరుగుతున్న ప్రతిసారీ అమెరికా సైనిక చర్యకు దిగుతోందని ఆయన విమర్శించారు. ద్వైపాక్షిక పరిష్కారం అందుబాటులో ఉన్నప్పటికీ అమెరికా నిర్లక్ష్యంగా సైనిక చర్యకు దిగుతోందని, ఇది బెదిరించే వ్యూహమా లేక ఒత్తిడి వల్లనా అని ప్రశ్నించారు. అయితే, ఇరాన్ ఎవరికీ, ఎలాంటి ఒత్తిడికీ తలవంచదని స్పష్టం చేశారు.




