శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ పైశాచికం (వీడియో)

6480చూసినవారు
AP: ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని వారిని దారుణంగా హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ పైశాచికత్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్, అధ్యక్షుడు బసవ రమణ అభ్యర్థుల నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు తీసుకుని ఉద్యోగం ఇప్పించలేదు. దాంతో ఉద్యోగ విషయమై అభ్యర్థులు ప్రశ్నించగా.. బెల్టుతో విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.