
సూర్యలంక బీచ్లో 'జీఎస్టీ సూపర్ సేవింగ్స్'పై సైకత శిల్పం (వీడియో)
ఏపీలోని బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం ప్రజలకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ ఆకట్టుకుంటోంది. విజయవాడకు చెందిన సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ దీనిని రూపొందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీఎస్టీపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈ శిల్పాన్ని రూపొందించినట్లు శిల్పి తెలిపారు.




