ఆసియా క‌ప్‌ను బ‌హిష్క‌రించిన పాకిస్థాన్?

20015చూసినవారు
ఆసియా క‌ప్‌ను బ‌హిష్క‌రించిన పాకిస్థాన్?
ఆసియా క‌ప్‌-2025ను పాకిస్థాన్ బ‌హిష్క‌రించినట్టు తెలుస్తోంది. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం UAEతో జరగాల్సిన మ్యాచ్ ఆడేందుకు పాక్ టీమ్ హోట‌ల్ నుంచి బ‌య‌ట‌కు రాలేదు. పాక్ సూపర్-4కి చేరుకోవాలంటే ఇవాళ జ‌ర‌గాల్సిన మ్యాచ్ గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు గెలిస్తే.. సెప్టెంబర్ 21న దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాక్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్