భారత్‌ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్‌ కుట్రలు

6చూసినవారు
భారత్‌ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్‌ కుట్రలు
భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్థాన్ భారత్ చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు నేపాల్, బంగ్లాదేశ్‌లలో శిక్షణ కేంద్రాలు, నివాస సముదాయాలను సిద్ధం చేస్తోంది. ఆపరేషన్ సిందూర్‌ తర్వాత ఈ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. ఇటీవల బంగ్లా, నేపాల్ సమీపంలోని భారత రాష్ట్రాల్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ నేపాల్‌లో, అల్-ఖైదా, ఐసిస్ బంగ్లాదేశ్‌లో కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్