సిక్కు కాదంటూ.. 14 మందిని వెనక్కి పంపేసిన పాక్

6చూసినవారు
సిక్కు కాదంటూ.. 14 మందిని వెనక్కి పంపేసిన పాక్
సిక్కుల గురువు గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లోని అట్టారి-వాగా సరిహద్దు వద్ద 14 మందికి పైగా యాత్రికులకు ప్రవేశాన్ని పాకిస్థాన్ నిరాకరించింది. వారి హిందూ మత విశ్వాసాలను కారణంగా చూపుతూ పాకిస్థాన్ ఇమిగ్రేషన్ అధికారులు వారిని వెనక్కి పంపినట్టు సమాచారం. ఈ పర్యటన కోసం ఒక్కొక్కరు రూ.13,000 చెల్లించినప్పటికీ, ప్రవేశం నిరాకరించారు. టిక్కెట్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. గురునానక్ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో పర్యటించేందుకు 2,100 మందికి కేంద్ర హోం శాఖ క్లియరెన్స్ ఇచ్చింది.