
మహిళలకు నెలకు రూ.1,500.. కీలక అప్డేట్
AP: 'ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం. మొదటి విడత నిధుల విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.




