
వైద్యం పేరుతో మహిళపై అత్యాచారం
హిమాచల్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీవ్ బిందాల్ సోదరుడు, డాక్టర్ అయిన రామ్ కుమార్ బిందాల్ ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. చికిత్స చేస్తానని చెప్పి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 7న ఆరోగ్య సమస్యల పేరుతో తనను తాకి, లైంగిక ప్రశ్నలు అడిగినట్లు మహిళ ఆరోపించింది. పరీక్షల పేరుతో తనపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు అక్కడి నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేశారు.




