
2011 ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి ఊరట?
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం టీచర్లు కూడా 'టెట్' రాస్తున్నారు అయితే పరీక్ష సిలబస్లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు ఉండటంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో 2011 ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునివ్వడంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అడిగినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో 12 లక్షల మందికి పైగా టీచర్లకు ఊరట లభించే అవకాశం ఉంది.




