దేశ విభజన తర్వాత పాక్ భాగమైన సింధు ప్రావిన్స్ ఏదో ఒక రోజు భారత్‌లో విలీనం అవుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో విశ్వ సింధీ హిందూ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సింధీ సమాజం భారతదేశ సాంస్కృతిక గుర్తింపునకు చిహ్నమన్నారు. పొరుగు దేశాల నుంచి మతపరమైన హింస నుంచి పారిపోయి వచ్చిన మైనారిటీలకు భారత్ అభయం ఇచ్చిందని, సీఏఏ ద్వారా వారికి సురక్షితమైన జీవితాన్ని అందించిందని తెలిపారు.