జమ్మూలోని సాంబా సెక్టార్ పరిధిలో పాకిస్థాన్ డ్రోన్ కదలికలు కలకలం సృష్టించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పద శబ్ధం రావడంతో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్ ద్వారా పాక్ ముష్కరులు భారత భూభాగంలోకి ఆయుధాలను జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఒక పొట్లంలో ప్యాక్ చేసిన 3 పిస్టల్స్, గ్రెనేడ్, 16 రౌండ్ల బెల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లు లభ్యమయ్యాయి.