
3 ప్రముఖ ఆలయాలకు ముకేశ్ అంబానీ భారీ విరాళం
రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఒకే రోజులో మూడు ప్రముఖ ఆలయాలను దర్శించి భారీ విరాళాలు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించి, రోజుకు 2 లక్షల మందికి అన్నప్రసాదం అందేలా కొత్త వంటశాల నిర్మాణానికి సహాయం చేయనున్నారు. అలాగే రాజస్థాన్లోని నాథ్ద్వారా ఆలయానికి రూ.50 కోట్లకు పైగా విరాళం, కేరళ గురువాయూర్ దేవస్థానం ఆస్పత్రికి తొలి విడతగా రూ.15 కోట్లు విరాళమిచ్చారు.




