ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ముగింపుకు ఈజిప్టు షర్మ్–షేక్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. గాజాలో శాంతి సాధనలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని, భారత్–పాక్ యుద్ధాన్ని కూడా ఆయనే ఆపారని అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడని ప్రకటించారు. షరీఫ్ వ్యాఖ్యలతో ట్రంప్ ఆశ్చర్యపడి “ఇక నేను మాట్లాడేది ఏమీ లేదు, ఇంటికి వెళ్దాం” అని సరదాగా స్పందించగా, సభ నవ్వులతో మార్మోగింది.