నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కవ్వింపులకు పాల్పడింది. గగనతలంలో పాక్ డ్రోన్లు కలకలం సృష్టించాయి. వీటిని గుర్తించిన మన భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పాక్ భూభాగం నుంచి ఆరు డ్రోన్లు ఎగురుతూ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నిఘా కోసం దాయాది దేశం వీటిని ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఆయుధాలు, మాదకద్రవ్యాలను డ్రోన్లు జారవిడిచి ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.