TG:
కేసీఆర్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మిగిలిన 10 శాతం పనులను సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ ఆరోపించారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పాలమూరు రైతులు, వ్యవసాయం తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన మండిపడ్డారు. రైతులు తిరగబడక ముందే
కేసీఆర్ పాలనలో మాదిరిగా నిరంతర విద్యుత్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని, అధికారులను ఆయన డిమాండ్ చేశారు.