కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించినప్పటికీ, ఇంకా లింక్ చేసుకోని వారికి జనవరి 1 నుండి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ గడువులోగా లింక్ చేసుకోకపోతే జీతం, ఆదాయపు పన్ను రిటర్న్స్, రుణాలు, బ్యాంకింగ్, పెట్టుబడులు వంటి ఆర్థిక లావాదేవీలు నిలిచిపోవచ్చు. ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప పాన్ సెంటర్‌కు వెళ్లి లింక్ చేసుకోవాలని సూచించారు. SMS ద్వారా కూడా లింక్ చేసుకునే అవకాశం ఉంది.