74 ఏళ్ల తర్వాత సముద్ర గర్భంలో పాన్ యామ్ విమానం శకలాలు లభ్యం

8173చూసినవారు
74 ఏళ్ల తర్వాత సముద్ర గర్భంలో పాన్ యామ్ విమానం శకలాలు లభ్యం
1952 ఏప్రిల్ 11న ప్యూర్టో రికో నుంచి న్యూయార్క్ వెళ్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యవసర ల్యాండింగ్ అయిన పాన్ యామ్ విమానం 'క్లిప్పర్ ఎండీవర్' శకలాలను 74 ఏళ్ల తర్వాత పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 52 మంది మృతి చెందారు. జూన్ 2న 'ఎయిర్/సీ హెరిటేజ్ ఫౌండేషన్', 'ఎక్స్‌పెడిషన్ అన్-నోన్' బృందం సంయుక్తంగా 2,000 అడుగుల లోతున విమాన శకలాలను కనుగొన్నారు. ప్రయాణికులకు భద్రతా సూచనలు లేకపోవడం, లైఫ్ జాకెట్లపై అవగాహన లేకపోవడం మరణాలకు కారణమని తేలింది. ఈ ప్రమాదం తర్వాతే విమానాల్లో భద్రతా సూచనలు తప్పనిసరి అయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్