
దోషం తొలగిస్తానని చెప్పి నకిలీబాబా అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
మహారాష్ట్రలోని లాతూర్లో జాతక దోషం తొలగిస్తానంటూ 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. రమేశ్వర్ రామ్దాసి మహారాజ్ అనే వ్యక్తి ప్రత్యేక పూజ చేస్తే దోషం తొలగిపోతుందని బాలిక తల్లిదండ్రులను నమ్మించాడు. పూజ సమయంలో బాలికను ఒంటరిగా గదిలో ఉంచి దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు చెబితే కుటుంబానికి అరిష్టం జరుగుతుందని బెదిరించాడు. బాలిక గర్భవతి కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు.




