తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం 3,752 సర్పంచ్, 28,410 వార్డులకుగాను పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు కాంగ్రెస్ బలపరిచిన 295 మంది సర్పంచ్ అభ్యర్థులు లీడింగ్ లో దూసుకెళ్తున్నారు. 49 మంది బీఆర్ఎస్, 10 మంది BJP, ఇతరులు 59 మంది సర్పంచ్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.