తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ఆ రెండు పార్టీల పొత్తు ఖరారు

16535చూసినవారు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ఆ రెండు పార్టీల పొత్తు ఖరారు
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఐ, సీపీఎం పార్టీలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎన్నికల్లో పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరు పోటీ చేయకుండా ఉండాలని రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్