పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

2614చూసినవారు
పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
TG: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ సిబ్బంది డేటాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని సూచించింది. ఫిబ్రవరిలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను పునఃపరిశీలించాలని తెలిపింది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం, పంచాయతీలు, వార్డుల సంఖ్య ఆధారంగా వివరాలు ఉండాలంది. దీంతో త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్