తెలంగాణలో నేడు జరిగిన రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయని చాలా మంది యువతలో ఓ మహిళ స్పూర్తిని నింపారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట పరిధిలోని కల్వకుంట పోలింగ్ కేంద్రంలో నడవలేని స్థితిలో ఉన్న మహిళ ఓటు వేసింది. ఆమె నడవలేక పోయినా తండ్రి భుజాలపై మోసుకుంటూ పోలింగ్ కేంద్రానికి తీసుకురాగా.. తన ఓటు హక్కును వినియోగించుకుంది. అన్ని అవయవాల సక్రమంగా ఉండి బద్దకంతో ఓటు వేయకుండా ఉండిపోయే యువత ఆ మహిళను చూసి నేర్చుకోవాలని అక్కడి అధికారులు అన్నారు.