సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ మరోసారి గాయపడ్డాడు. భారత్ ఏ-సౌతాఫ్రికా ఏ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. షెపో మొరేకి బౌన్సర్ అతని వేలికి తగలడంతో గాయమైంది. తరువాత రెండో ఇన్నింగ్స్‌లో మోచేతి, గజ్జల భాగంలో బంతి తగిలి తీవ్ర నొప్పితో పెవిలియన్ చేరాడు. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, పంత్ గాయం టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది.