
పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ!
TG: చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి తన పిల్లలతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ వీడినట్లుగా తెలుస్తోంది. డిప్రెషన్ కారణంగానే ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అయితే మొదటి నుంచి తల్లి మాటలను తూచా తప్పకుండా పాటించేలా పిల్లలను పెంచడంతో, వారు ఆమె కంట్రోల్లోనే ఉన్నారని తెలిపారు. దీంతో తల్లి ఏం చెబితే అది చేసేందుకు సిద్ధమై జనవరి 30న రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.




