ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన పరాగ్.. వీడియో వైరల్

45చూసినవారు
PBKSతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్‌ (ఈ-సిగరెట్) చేస్తూ కనిపించడం వివాదంగా మారింది. మ్యాచ్ లైవ్ ప్రసారంలో ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో చర్చనీయాంశమైంది. సాధారణంగా స్టేడియం, డ్రెస్సింగ్ రూమ్‌లలో ధూమపానం నిషేధం కాగా, ఇండియాలో 2019 నుంచే ఈ-సిగరెట్ల విక్రయం, వినియోగంపై కూడా నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పరాగ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే భారీ జరిమానా, మ్యాచ్ సస్పెన్షన్ లేదా ఇతర శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.

ట్యాగ్స్ :