యువతలో పెరుగుతున్న పక్షవాతం.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు

1317చూసినవారు
యువతలో పెరుగుతున్న పక్షవాతం.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు
గత మూడు దశాబ్దాల్లో 20 నుంచి 54 ఏళ్ల యువతలో పక్షవాతం సంభవించే రేటు దాదాపు రెట్టింపు అయిందని అమెరికాలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. 1993 నుంచి 2020 మధ్య కాలంలో ఈ వయసు వారిలో పక్షవాతం కేసుల సంఖ్య లక్షకు 33.9 నుంచి 62.2కి పెరిగింది. ముఖ్యంగా ఇస్కీమిక్ స్ట్రోక్స్ కేసులు అధికమయ్యాయి. యువతలో ఈ పెరుగుదలకు మధుమేహం, అధిక బీపీ, అట్రియల్ ఫైబ్రిలేషన్, మత్తు పదార్థాల వినియోగం వంటివి కారణాలుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా 1990 నుంచి 2021 మధ్య 15-49 ఏళ్ల వారిలో పక్షవాతం కేసులు 36% పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్