కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్లనూరులో మానవత్వం మరిచిన తల్లిదండ్రులు తమ పిల్లలను పోలీస్ స్టేషన్‌లో వదిలేసి వెళ్లారు. భర్త, పిల్లలు వద్దంటూ లలిత తాళి, మెట్టెలు తీసేసి వెళ్లిపోయింది. దీంతో పిల్లలు తనకూ వద్దంటూ తండ్రి రవి వారిని ఎల్.ఎం.డీ పోలీస్ స్టేషన్‌లో వదిలి వెళ్ళిపోయాడు. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న రవి, లలిత మధ్య గత కొంతకాలంగా విబేధాలున్నాయని సమాచారం. తల్లిదండ్రులు వదిలి వెళ్లడంతో పిల్లలు పోలీస్ స్టేషన్‌లో భయంతో గడిపారు. చివరకు పోలీసులు వారిని తండ్రి తల్లిమ్మకు అప్పగించారు.