ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పరువు హత్య వెలుగు చూసింది. 15 ఏళ్ల కూతురిని కన్న తల్లిదండ్రులే గొంతు నులిమి చంపారు. పట్టుబడిన తండ్రి రమేశ్ సోన్కర్, కూతురు "చాలా మంది అబ్బాయిలను కలిసి వారితో మాట్లాడేది, మా పరువు తీస్తుందని, అందుకే చంపానని" నేరాన్ని అంగీకరించాడు. పరారీలో ఉన్న తల్లి సంతోషి కోసం పోలీసులు గాలిస్తున్నారు.