
మలేషియాలో నిరాశ్రయుడైన వ్యక్తిపై దాడి: వీడియో వైరల్
భారత్ నుంచి మలేషియాకు సఫీయుద్దీన్ పక్కీర్ మొహమ్మద్ అనే వ్యక్తి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2024లో వెళ్ళాడు. అక్కడ రెస్టారెంట్లో వంటవాడిగా ఉద్యోగం ప్రారంభించినా, యజమాని జీతం ఇవ్వకుండా పాస్పోర్ట్ తీసుకున్నాడు. దీంతో నిరాశ్రయుడై వీధుల్లో నివసిస్తున్న అతన్ని, ఆమ్బ్యాంక్ తమన్ మలూరి బ్రాంచ్ ముందు పడుకుంటున్నప్పుడు అక్కడి సెక్యూరిటీ గార్డు కాళ్లతో తన్ని, కర్రతో కొట్టి అవమానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




