భోజనం లేక రైల్లో స్పృహ తప్పి పడిపోయిన ప్రయాణికుడు

122చూసినవారు
భోజనం లేక రైల్లో స్పృహ తప్పి పడిపోయిన ప్రయాణికుడు
TG: డబ్బులు లేక రెండు రోజులుగా ఆకలితో అలమటించిన ప్రయాణికుడు రైల్లో స్పృహ కోల్పోయిన ఘటన ఖమ్మం జిల్లా మధిరలో చోటుచేసుకుంది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్ద భయాలు గ్రామానికి చెందిన జీవన్ కుమార్, లోకేశ్‌ కుమార్ బుధవారం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖకు బయల్దేరారు. జీవన్ కుమార్ మధిర స్టేషన్‌కు రాగానే కుప్పకూలగా, పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ రెండు రోజులుగా ఏం తినకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్