భువనేశ్వర్ నుంచి ముంబైకి వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో వైజాగ్ కు చెందిన పోయాడ వెంకటరమణ (59) అనే ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. వరంగల్ దాటగానే అస్వస్థతకు గురైన ఆయనను తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కాజీపేట రైల్వే జంక్షన్‌లో రైలును ఆపి, వెంకటరమణను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు.