ఇండిగో సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగుతున్న ప్రయాణికులు (VIDEO)

23చూసినవారు
TG: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఆందోళన పెరిగింది. అత్యవసర పనుల కోసం బయలుదేరిన తమకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై కస్టమర్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో సిబ్బందితో ప్రయాణికులు గొడవకు దిగుతున్నారు. ఓ మహిళ అయితే ఏకంగా కౌంటర్ ఎక్కి వారికి కొట్టేందుకు ప్రయత్నించింది. గ్లాస్ అడ్డుగా రావడంతో తిట్టడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్