ఆంధ్రప్రదేశ్‌లో పాస్‌పోర్ట్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. మారుమూల ప్రాంతాల ప్రజల కోసం మొబైల్ పాస్‌పోర్ట్ వాహనం అందుబాటులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ వాహనం ద్వారా రోజుకు 40 మందికి సంబంధించిన పత్రాల పరిశీలన, బయోమెట్రిక్, ఫోటో తీసి పాస్‌పోర్ట్ కోసం నమోదు చేస్తారు. పరిశీలన పూర్తయిన తర్వాత పాస్‌పోర్ట్ పోస్ట్ ద్వారా ఇంటికి వస్తుంది.