
నా పేరే ఎల్లమ్మ సాంగ్ నాగదుర్గ నటనతో యూట్యూబ్‌లో దూసుకుపోతున్న గీతం
ప్రస్తుత రోజుల్లో సినిమా పాటలతో సమానంగా జానపద గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, భాషా ప్రాధాన్యతతో రూపొందుతున్న జానపద పాటలు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సరికొత్త ఫోక్ సాంగ్ ‘నా పేరే ఎల్లమ్మ’. ఈ పాటలో తన అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ప్రముఖ ఫోక్ డాన్సర్ నాగదుర్గ. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఘనంగా జరుపుకునే బోనాల పండుగ కోసం రూపొందించిన ఈ పాట, ఇప్పటికే యూట్యూబ్‌లో 102 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.




