OG డబ్బింగ్ పూర్తి చేసిన పవన్

26659చూసినవారు
OG డబ్బింగ్ పూర్తి చేసిన పవన్
సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'OG'. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్నిచిత్రబృందం ఆదివారం ట్వీట్ చేసింది. 'OGని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ముగించారు' అని పేర్కొంటూ పవన్ ఫొటోలను షేర్ చేసింది. అంతకుముందు సుజిత్, తమన్‌తో పవన్ ఉన్న ఫొటోను పంచుకుంది. 'మిలియన్ డాలర్ పిక్చర్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. OG మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది.