TG:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని, వైఎస్
జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే వైసీపీతో ఉంటాడేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని, దమ్ముంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయాలని, ఆయన ఇంటి ముందు తాను నిలబడతానని అనిరుధ్ రెడ్డి సవాల్ విసిరారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.