పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్

12చూసినవారు
TG: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 'ఆయన ఒక ప్యాకేజ్ స్టార్. రేపు జగన్ ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆయనకు సపోర్ట్ చేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయండి. ఆయన ఇంటి ముందు నేను నిలబడతా. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా ముట్టుకోవాలని ఆంధ్ర నుండి ఎవరైనా వస్తే గో బ్యాక్ ఆంధ్ర ఉద్యమం మొదలైతది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్