జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు గుప్పించారు. చేగువేరా బొమ్మతో రాజకీయాల్లోకి వచ్చి, ఎర్ర కండువా కట్టుకున్న పవన్, కమ్యూనిస్టులతో పొత్తు విఫలమయ్యాక కాషాయం కండువా కప్పుకున్నారని ఆయన అన్నారు. మార్క్సిజాన్ని వదిలి ఇప్పుడు సనాతన వాదాన్ని ఎంచుకున్నారని, ఆయన రాజకీయ ప్రవేశం ఒక అపరిచితుడిలా ఉందని సాంబశివరావు అభిప్రాయపడ్డారు.