లోకేష్ కనకరాజ్ కొత్త ప్రాజెక్ట్ కోసం హీరోను ఎంపిక చేసే పనిలో ఉన్నారనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం పవన్ కళ్యాణ్‌తో చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ ఈ కాంబినేషన్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా లోకేష్ చెప్పిన కథ వారికి నచ్చిందని పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం.