
గ్లోబల్ బ్రాండ్ వాల్యూలో యాపిల్ టాప్
దక్షిణ కొరియా పత్రిక ‘పల్స్’ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ బ్రాండ్ విలువలో యాపిల్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. టెక్ దిగ్గజం శాంసంగ్ ఐదో స్థానంలో నిలవగా, ఎన్వీడీయా అద్భుతంగా ఎగబాకి 36వ స్థానం నుంచి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ నివేదిక ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో వృద్ధి, మార్కెట్ ఆధిపత్యం యాపిల్, ఎన్వీడీయా బ్రాండ్ విలువ పెరగడానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నాయి.




