పవన్ కళ్యాణ్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి: వేముల ప్రశాంత్ రెడ్డి

13చూసినవారు
పవన్ కళ్యాణ్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి: వేముల ప్రశాంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని, నోరు జారితే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేయాలని సూచిస్తూ, తెలంగాణతో పవన్ కళ్యాణ్‌కు ఏం పనిలేదని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణపై దండయాత్ర చేసే శక్తులను ఉరికించి కొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్