
మహేష్ - రాజమౌళి సినిమా టైటిల్ ఏంటో తెలుసా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా టైటిల్‌గా 'వారణాసి'ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ఈ నగరం పేరు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తుందని భావిస్తున్నారు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నవంబర్ లో భారత్ కు రానున్న నైపథ్యంలో ఆయన చేతుల మీదుగా టైటిల్ రివీల్ చేసేందుకు రాజమౌళి ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది.




