ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటకలోని చింతామణి గ్రామంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాల్ గౌడ్ జన్మదిన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం గోపాల్ గౌడ్ రచించిన పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించనున్నారు.