AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ బోర్డు ఛైర్మన్, ఎమ్మెల్సీ
నాగబాబు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. పవన్ పేరిట మారేడు మొక్కను నాటారు. మారేడు దళాలు శివుడికి ఇష్టమైనవని, సనాతన ధర్మాన్ని గౌరవించే పవన్‌కు ఇదే తన ప్రత్యేక కానుక అని తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా తాను 20 మొక్కలు నాటినట్లు వెల్లడించిన
నాగబాబు.. పవన్ అభిమానులంతా కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక్కో మొక్క నాటాలని పిలుపునిచ్చారు.