పవన్‌ను కేబినెట్‌ నుంచి బర్తరఫ్ చేయాలి: సీపీఐ నారాయణ

36చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. పవన్‌ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వల్ల తెలుగు ప్రజల మధ్య ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలుగు ప్రజలు భౌగోళికంగా విడిపోయారే తప్పా.. వారి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. గతంలో చేగువేరా వైపు ఉన్న పవన్ ఇప్పుడు సావర్కర్ శిష్యుడు అయ్యారని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. ఆయన పదవిలో ఉండి ఉపయోగం లేదన్నారు.
Job Suitcase

Jobs near you