పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: వైఎస్ షర్మిల

14చూసినవారు
పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: వైఎస్ షర్మిల
AP: కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. 'పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు. మూఢ నమ్మకాలతో ప్రజలను కించపరచడం, ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి అంటూ రుద్దడం సరికాదు. చిత్తశుద్ధి ఉంటే ఉప్పునీటి ముప్పును తప్పించండి' అని బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్