ఒడిశాకు చెందిన 18 ఏళ్ల పాయల్ నాగ్.. చిన్నతనంలో విద్యుత్ షాక్‌తో రెండు చేతులు కోల్పోయినప్పటికీ, పారా ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తోంది. లింబ్స్ లేని తొలి ఆర్చర్‌గా గుర్తింపు పొందిన ఆమె, 2025 నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, ఖేలో ఇండియాలో రజతం సాధించింది. బాణాలు వదిలేందుకు ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తున్న పాయల్, ఈ నెల 29 నుంచి జరగనున్న వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత తరఫున పోటీ పడనుంది.