చొప్పదండి మండలం వెదురుగట్ట నుండి చాకుంట మీదుగా ఫకీర్పేట వరకు 7 కోట్ల 13 లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు అనుమతులు మంజూరైనట్లు మండల
కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించాలని సంకల్పంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.