కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఫోటో లేకపోవడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాలా రాజేందర్ రావు వర్గీయులు ప్రోటోకాల్ ను పాటించలేదని, ఇది జిల్లా నేతల మధ్య ఆధిపత్య పోరును మరోసారి బహిర్గతం చేసిందని తెలుస్తోంది.