ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా కోనేరుపల్లి

2682చూసినవారు
ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా కోనేరుపల్లి
చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ వేణుగోపాల రాజు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా ప్రకటించారు. గ్రామంలోనీ ప్రతి ఇంటికి జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొండగట్టు దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, డి ఆర్ డి ఓ గీత, ఎంపీడీవో వేణుగోపాలరావు, ఎంపీ ఓ రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్